బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నజ్రియా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ కి కష్టపడుతూనే ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 4వ రోజు 70% కి పైగా డ్రాప్ అవ్వగా 5వ రోజు ఏకంగా 30% కి పైగా డ్రాప్ అవ్వగా….
6వ రోజు మరోసారి 30% కి పైగా డ్రాప్ అయింది మరోసారి… సినిమా 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ కన్నా కూడా 6వ రోజు వరల్డ్ వైడ్ గా….
65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అటు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 6 రోజుల్లో వరల్డ్ వైడ్ సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 5.43Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 1.33Cr
👉East: 93L
👉West: 79L
👉Guntur: 86L
👉Krishna: 83L
👉Nellore: 57L
AP-TG Total:- 11.87CR(20.10CR~ Gross)
👉KA+ROI:- 1.30Cr
👉OS: 4.80Cr
Total WW:- 17.97CR(31.75CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయిన తర్వాత సాధించిన టోటల్ కలెక్షన్స్. సినిమా తెలుగు రాష్ట్రాలలో సగం టార్గెట్ ను కూడా ఇప్పటి వరకు…..
అందుకోలేక పోయింది. ఇంకా 12.13 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా… వరల్డ్ వైడ్ గా 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 13.03 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.