బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వచ్చిన అంటే సుందరానికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది సినిమా. ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయని అంటే సుందరానికీ సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల షేర్ ని అందుకోగా…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు మరోసారి 30% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7వ రోజు మొత్తం మీద…
35 లక్షల నుండి 40 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. సినిమా రెండో వారంలో సెన్సేషనల్ హోల్డ్ ని చూపెట్టి గ్రోత్ చూపిస్తే తప్ప ఇక తేరుకోవడం కష్టమే…