క్యారెక్టర్ రోల్స్ నుండి మెయిన్ లీడ్ హీరోగా ఎదిగిన సత్యదేవ్ రెండేళ్ళ క్రితం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో డిజిటల్ లో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్నాడు, కానీ తర్వాత సత్యదేవ్ నుండి ఆడియన్స్ ముందుకు రావాల్సిన కొన్ని సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అయినా ఏవి ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా మ్యాజిక్ ని రిపీట్ చేయలేక పోయాయి…. ఇలాంటి టైం లో ట్రైలర్ లాంచ్ తో కొద్ది వరకు….
అంచనాలను పెంచిన సినిమా గాడ్ సే ఆడియన్స్ ముందుకు ఈ మధ్యే రిలీజ్ అవ్వగా సినిమా స్టొరీ పాయింట్ ఆల్ రెడీ ఎన్నో సినిమాల్లో చూసిందే అయినా సత్యదేవ్ నటనకి పేరు వచ్చినా సినిమా మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేక పోయింది…
దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ గట్టిగానే పడి ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించలేక పోయింది. సినిమాను ఓవరాల్ గా 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారని ట్రేడ్ లో టాక్ ఉండగా థియేట్రికల్ బిజినెస్ 4.50 కోట్ల వర్త్ ఉంటుందని సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరగానే పరుగును….
పూర్తీ చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 30L
👉Ceeded: 13L
👉AP – 21L
AP-TG Total:- 0.64CR(1.20CR~ Gross)
👉KA+ROI+OS: 0.07Cr
Total WW:- 0.71CR(1.35CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద బిజినెస్ లో 20% కూడా రికవరీ చేయలేక పోయింది ఈ సినిమా…
ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఆల్ మోస్ట్ 4.30 కోట్ల మేర నష్టపోయింది. నటుడిగా మంచి పేరున్న సత్యదేవ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి సక్సెస్ ఇంకా పెండింగ్ లోనే ఉందని చెప్పాలి. మరి తన అప్ కమింగ్ మూవీస్ లో అయినా ఓ భారీ హిట్ సొంతం అవ్వాలని కోరుకుందాం.