Home న్యూస్ పక్కా కమర్షియల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

పక్కా కమర్షియల్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

యాక్షన్ హీరో గోపీచంద్ రాశిఖన్నాల కాంబినేషన్ లో మారుతి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. రీసెంట్ టైం లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతితో సినిమా అంటేనే అంచనాలు పెరిగి పోయాయి. మరి పక్కా కమర్షియల్ మూవీ ఆ అంచనాలను అందుకుందా లేదా అన్న విశేషాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

ఒక కేసు విషయంలో తప్పు చేశాను అని భావించిన జడ్జ్ సత్యరాజ్ తన పదవికి రాజీనామ చేస్తాడు…. కానీ తన కొడుకు అయిన హీరో మాత్రం పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తాడు. అలాంటి లాయర్ దగ్గరకు అసిస్టంట్ గా హీరోయిన్ వస్తుంది… ఒక కేసు విషయంలో తండ్రి కొడుకులే కోర్టులో పోరాడాల్సి వస్తుంది… తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ….

పెర్ఫార్మెన్స్ పరంగా గోపీచంద్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఫుల్ స్టైలిష్ గా మెప్పించాడు, తన లుక్స్, యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక రాశిఖన్నా రోల్ మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా ఉంటుంది, కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా కొన్ని సీన్స్ మరీ ఓవర్ గా అనిపిస్తాయి.

ఇక సత్యరాజ్ రోల్ పర్వాలేదు అనిపించగా రావ్ రమేష్ మాత్రం తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో కుమ్మేశాడు, కొన్ని సీన్స్ లో సప్తగిరి కామెడీ మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించుకున్నారు. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ గా ఉంది…. బెటర్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండి ఉంటే బాగుండేది…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నాయి… సాంగ్స్ ప్లేస్ మెంట్ బాలేదు, ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మారుతి రీసెంట్ గా సినిమా గురించి చెబుతూ ఇది రొటీన్ స్టొరీనే తెరకెక్కిన సినిమానే అయినా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఆడియన్స్ ని అలరించే విషయంలో మెప్పిస్తుంది అన్నాడు….

ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి వర్తిస్తుంది అని చెప్పాలి. కథలో లాజిక్స్ వెతకకుండా కామెడీ అండ్ ఓవర్ ది టాప్ సీన్స్ తో కూడిన రొటీన్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి పక్కా కమర్షియల్ నచ్చుతుంది, జాతిరత్నాలు, ఎఫ్3 లాంటి మూవీస్ ని పోలి ఉంటుంది పక్కా కమర్షియల్ మూవీ…. ఎంటర్ టైన్ మెంట్ కూడా చాలా వరకు వర్కౌట్ అయినా కానీ….

అవి పైన చెప్పిన సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చుతాయి, కథ అద్బుతంగా ఉండాలి, ట్విస్ట్ లు మైండ్ బ్లాంక్ చేయాలి లాంటి అంచనాలతో వెళ్ళే ఆడియన్స్ కి సినిమా నచ్చే అవకాశం తక్కువ…. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే…. హీరో క్యారెక్టర్ బాగుండటం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకోవడం, కామెడీ సీన్స్ మెప్పించడం లాంటివి హైలెట్స్ అయితే…

రొటీన్ కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, సెకెండ్ ఆఫ్ మెలోడ్రామా మైనస్ పాయింట్స్ అని చెప్పాలి…. ఓవరాల్ గా మారుతి మూవీస్ కథ పాయింట్స్ చిన్నవే అయినా ఎంటర్ టైన్ మెంట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది… ఈ సారి అది ఇది వరకటి సినిమాలతో పోల్చితే అంతలా కనెక్ట్ అయ్యేలా లేదు కానీ ఎలాంటి అంచనాలు లేకుండా బ్రెయిన్ ని ఇంట్లో పెట్టేసి రొటీన్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా నచ్చే అవకాశం ఉంది…. మిగిలిన ఆడియన్స్ కూడా కొంచం ఓపికతో చూస్తె పక్కా కమర్షియల్ ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here