బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో అతి కష్టం మీద అందుకోవాల్సిన టార్గెట్ లో సగం కలెక్షన్స్ ని దక్కించుకున్న గోపీచంద్ లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో అడుగు పెట్టగా థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది, దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపిస్తూ ఉండగా సినిమా దానికి తోడూ కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో….
ఆ ఇంపాక్ట్ కూడా గట్టిగానే సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 8వ రోజు 7వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 8వ రోజు 7-8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8వ రోజు 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి…