ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో నోటబుల్ తెలుగు మూవీ అయిన హ్యాపీ బర్త్ డే సినిమా లోవేస్ట్ టికెట్ రేట్స్ తో వచ్చినప్పటికీ కూడా జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేదు, దానికి తోడూ సినిమా కి నెగటివ్ టాక్ ఉండటం, రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వర్షాలు పడటం లాంటివి ఓపెనింగ్స్ పై గట్టిగానే ఇంపాక్ట్ ని చూపాయి. మొదటి రోజు మొత్తం మీద సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 26 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చే సరికి తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు….
30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద 2 రోజులకు గాను తెలుగు రాష్ట్రాలలో 46 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక సినిమా బిజినెస్ డీటైల్స్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.