బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ నెలన్నరగా వారం వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటలేక పోతుంది. దాంతో కొన్ని సినిమాలకు టికెట్ రేట్స్ ని కూడా భారీగా తగ్గించి జనాలను థియేటర్స్ కి రప్పించాలి అని ట్రై చేసినా కానీ అది అస్సలు సఫలం అవ్వలేదు… జనాలు ఇప్పటికీ అంతంత రేట్లు పెట్టి థియేటర్స్ కి వచ్చేంత స్టఫ్ ఉన్న…
సినిమాల కోసం ఎదురు చూస్తున్నారేమో కానీ మిగిలిన సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ఇంపాక్ట్ నెలన్నరగా చాలా క్లియర్ గా కనిపించగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశలు అన్నీ కూడా ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ పైనే….
పెట్టుకుని జనాలను తిరిగి ఈ సినిమా థియేటర్స్ కి రప్పిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు… సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన పాటలు కానీ ట్రైలర్ కానీ అన్నీ ప్రామిసింగ్ గా ఉండగా సినిమా పై ట్రేడ్ లో అండ్ ఆడియన్స్ లో మంచి బజ్ ఇప్పుడు నెలకొంది అని చెప్పాలి.
కానీ ప్రసుతం జనాలు తక్కువ రేట్స్ ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ కి రావాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉండగా ది వారియర్ సినిమా మేకర్స్ మాత్రం నార్మల్ రేట్స్ పెట్టకుండా ఈ సినిమాకి కూడా టికెట్ హైక్స్ ని పెట్టారు. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో 175 టికెట్ రేట్ ఉండగా మల్టిప్లెక్సులలో 250 నుండి 295 వరకు టికెట్ రేట్స్ ఉన్నాయి. ఇక ఆంధ్రలో 145 నుండి 175 వరకు సింగిల్ స్క్రీన్స్ లో…
మల్టిప్లెక్సులలో 200 వరకు టికెట్ రేట్స్ పెట్టారు…. దాంతో ఇంత రేటు పెట్టి సినిమా చూడటానికి జనాలు థియేటర్స్ కి వస్తారో రారో అన్న అనుమానాలు మొదలు అవ్వగా ఈ టికెట్ రేట్స్ ఒక్కటి సినిమాకి ఇప్పుడు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ టాక్ పాజిటివ్ గా ఉంటె కచ్చితంగా జనాలను థియేటర్స్ రప్పించే కెపాసిటీ ఈ సినిమా కి ఉందని చెప్పాలి.