ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన రామ్ పోతినేని, తర్వాత రెడ్ మూవీ తో మరో హిట్ ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వస్తున్న సినిమా ది వారియర్… ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా ట్రేడ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకోగా బిజినెస్ కూడా ఎక్స్ లెంట్ గా జరిగింది. ఇక భారీ రిలీజ్ ను కూడా….
కన్ఫాం చేసుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే స్టార్ట్ అయినా కానీ బుకింగ్స్ నిరాశ పరిచే విధంగా ఉన్నాయి. దీనికి 2 కారణాలు…. ఒకటి నార్మల్ టికెట్ రేట్స్ తోనే జనాలు థియేటర్స్ కి రావడం లేదు అంటే ఈ సినిమాకి టికెట్ హైక్స్ ని పెట్టారు…
ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపిస్తూ ఉండగా మరో బిగ్ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాలు. ఈ వీకెండ్ అయ్యే వరకు కూడా ఈ వర్షాలు ఆగే అవకాశం కనిపించక పోవడంతో జనాలు ఇంట్లో నుండి బయటికి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలా ఈ 2 ఇంపాక్ట్ వలన…
ది వారియర్ సినిమా కి బజ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ బజ్ బుకింగ్స్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపడం లేదు…. దాంతో సినిమా బుకింగ్స్ చాలా నాసిరకంగా ఉండగా ఇప్పుడు కంప్లీట్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి సినిమా రిలీజ్ కానుంది… రిలీజ్ అయిన తర్వాత టాక్ బాగుంటే వర్షాలు కొంచం స్లో అయితే షో షోకి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ ని చూపించే….
అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో అన్నీ అనుకున్నట్లు జరిగితే 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. ఒక వేల షో షోకి ఇంప్రూవ్ మెంట్ లేకుంటే 3 కోట్ల రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఓపెన్ అవుతుందో చూడాలి ఇక.