బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ, వెంకీ మామ, లవ్ స్టొరీ మరియు బంగార్రాజు ఇలా వరుస పెట్టి హిట్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్నాడు నాగ చైతన్య. ఇందులో 2 సినిమాలు మల్టీ స్టారర్ మూవీస్ కాగా 2 సినిమాలు సోలో హీరోగా చేసినవి. మొత్తం మీద కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో దూసుకు పోయిన నాగ చైతన్య రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు థాంక్ యు సినిమాతో భారీ డిసాస్టర్ ను సొంతం చేసుకుని….
వరుస హిట్స్ కి బ్రేక్ పడేలా చేసుకున్నాడు… కానీ ఈ సినిమా నిరాశ పరిచినా తన రెమ్యునరేషన్ రీసెంట్ టైం లో బాగానే పెరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మజిలీ టైం లో సినిమాకి 6 కోట్ల దాకా తీసుకునే నాగ చైతన్య తర్వాత చేసిన సినిమాలకు 6-8 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ని తీసుకున్నారని ట్రేడ్ లో టాక్ ఉండగా ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో…
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేసిన థాంక్ యు సినిమా కి గాను ఓవరాల్ గా 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని సొంతం చేసుకున్నారని ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ టాక్ వినిపిస్తుంది. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా టెలివిజన్ లో డబ్బింగ్ లో డిజిటల్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఈ రేంజ్ రెమ్యునరేషన్ సబబు అనే అంటున్నారు.
కానీ థాంక్ యు డిసాస్టర్ తర్వాత నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఏ సినిమాతో నాగ చైతన్య సాలిడ్ కంబ్యాక్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటాడో చూడాలి.