బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల పరంగా ఇప్పటికీ రెండంకెల ఓపెనింగ్స్ ని అందుకోవడానికి ఇంకొంచం టైం పట్టేలా ఉండనిపిస్తుంది అని చెప్పాలి. రామ్ ది వారియర్ సినిమా ఆ మార్క్ ని మొదటి రోజు అందుకునే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితులు దెబ్బ కొట్టాయి. కానీ అదే టైం లో రామ్ నటించిన సినిమాల ఓపెనింగ్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఏకంగా…
కొత్త రికార్డ్ ను నమోదు చేశాడు అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే యువ సామ్రాట్ నాగ చైతన్య లీడింగ్ లో ఉన్నప్పటికీ కూడా సోలో హీరో గా మాత్రం రామ్ ఇప్పుడు టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఈ హీరోలు నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ గ్రాస్…..
10 కోట్ల మార్క్ ని కంటిన్యూగా సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు పోతున్నారు. ముందుగా నాగ చైతన్య నటించిన మజిలీ, వెంకిమామ, లవ్ స్టొరీ మరియు బంగార్రాజు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి 10 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపాయి…
సోలో హీరోగా మాత్రం మజిలీ మరియు లవ్ స్టొరీ సినిమాలు నిలుస్తాయి అని చెప్పాలి. ఇక రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా, రెడ్ ది ఫిల్మ్ అలాగే ఇప్పుడు ది వారియర్ సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు…
టాప్ లో దూసుకు పోతున్నారు. సోలో హీరోగా రామ్ టాప్ లో ఉంటె, ఓవరాల్ గా అన్ని సినిమాల విషయంలో నాగ చైతన్య టాప్ లో ఉన్నాడు. సోలో హీరోగా కూడా రామ్ ని సమం చేయాలి అంటే నాగ చైతన్య లేటెస్ట్ మూవీ థాంక్ యు తొలిరోజు 10 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక.