బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ సమ్మతమే రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు. అయినా కానీ ఈ సినిమా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టింది అని చెప్పొచ్చు ఓవరాల్ గా సినిమా లెక్కలు చూస్తుంటే… సినిమాను మొత్తం మీద 3.50 కోట్ల రేంజ్…
బడ్జెట్ లో నిర్మించగా సినిమా డిజిటల్ హక్కులు ఆల్ మోస్ట్ 1.60 కోట్ల దాకా రేటు ని సొంతం చేసుకోగా తెలుగు శాటిలైట్ రైట్స్ కి 60 లక్షల రేటు సొంతం అయ్యిందంట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ కలిపి మరో 2 కోట్లు రికవరీ అయిందని సమాచారం.
దాంతో నాన్ థియేట్రికల్ రైట్స్ 4.20 కోట్లు కాగా థియేట్రికల్ బిజినెస్ 4 కోట్లకు జరిగింది. దాంతో ఓవరాల్ గా 8.20 కోట్ల బిజినెస్ ను అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.3 కోట్ల షేర్ తో పరుగును ముగించగా నిర్మాతకి బడ్జెట్ మీద సాలిడ్ ప్రాఫిట్స్ దక్కినప్పటికీ బయర్స్ కి మాత్రం నష్టాలు తప్పలేదు. అయినా కానీ చిన్న సినిమానే అయినా సాలిడ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…