టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మగధీర తో ఆల్ టైం రికార్డులను డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసిన రోజులు అవి, పాత రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులతో మెంటల్ మాస్ అనిపించిన మగధీర తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైం లో… ఈగ అనే చిన్న యానిమేషన్ మూవీ చేస్తాడు అంటూ వార్తలు వచ్చినా ఆ సినిమా కి…
గ్రాఫిక్స్ లాంటివి ఉంటాయి కొంచం టైం పడుతుంది కాబట్టి ఎలాంటి గ్రాఫిక్స్ హంగులు లేకుండా ఓ చిన్న సినిమా చేయాలనీ డిసైడ్ అయిన జక్కన్న అప్పటికి కమెడియన్ గా టాప్ లో ఉన్న సునీల్ తో మర్యాదరామన్న అనే సినిమా ను అనౌన్స్ చేశాడు… హాలీవుడ్ లో ఎప్పుడో వచ్చిన ఓ సినిమా…
స్ఫూర్తి తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని తర్వాత తెలిసినా ఈ సినిమా పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి కానీ రిలీజ్ కి ముందే జక్కన్న సినిమా కథ మొత్తం కూడా రివీల్ చేశాడు. దాంతో కథ మొత్తం చెప్పక జనాలు థియేటర్స్ కి వస్తారా అనే అనుమానాలు కూడా…
అందరిలో ఏర్పడ్డ టైం లో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన మర్యాదరామన్న పెద్ద హీరోల సినిమాల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సినిమాను తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించిన జక్కన్న ఓవరాల్ గా సినిమాను 14.2 కోట్ల రేటు కి టోటల్ గా అమ్మేశారు… మగధీర లాంటి సినిమా తర్వాత ఈ బిజినెస్ తక్కువే కానీ…
చేసింది కూడా చిన్న సినిమానే కాబట్టి తక్కువ రేట్లకే సినిమాను అమ్మగా లాంగ్ రన్ లో సినిమా 26 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని బిజినెస్ మీద ఏకంగా 12 కోట్ల వరకు లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సునీల్ కి హీరోగా మంచి అవకాశాలు వచ్చేలా చేసిన ఈ సినిమా వచ్చి 12 ఏళ్ళు పూర్తీ అయింది…