బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ జులై మంత్ చాలా అంటే చాలా నీరసంగా మారిపోయింది… నోటబుల్ హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కి ఉండటంతో ఈ నెలలో టాలీవుడ్ కి వరుస హిట్స్ పడతాయి అన్న నమ్మకం ఏర్పడింది కానీ ఇప్పుడు ఓవరాల్ గా రిజల్ట్ లు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే విధంగా సొంతం చేసుకోవడం విచారకరం అని చెప్పాలి… ముందుగా మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ నటించిన…
పక్కా కమర్షియల్ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది అనుకుంటే ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచి గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీగా మిగిలి పోయి మారుతి డైరెక్షన్ లో వీకేస్ట్ మూవీగా నిలిచింది.
ఇక తర్వాత రామ్ పోతినేని లింగుస్వామిల బైలింగువల్ మూవీ వారియర్ పై మంచి అంచనాలు ఉండగా మిక్సుడ్ టాక్ వలన మంచి ఓపెనింగ్స్ తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసి ఇప్పుడు భారీ నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉంది. ఇక లేటెస్ట్ గా నాగ చైతన్య నటించిన….
థాంక్ యు సినిమా పై పెద్దగా బజ్ ఏమి లేదు… దానికి తగ్గట్లే సినిమా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని నాగ చైతన్య కెరీర్ లోనే లోవేస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా విక్రమ్ కుమార్ కెరీర్ లో వీకేస్ట్ మూవీగా నిలిచి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ మూవీగా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇలాంటి టైం లో ఈ నెల ఎండ్ కి…
ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు… ట్రైలర్ రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రామిసింగ్ మూవీలా అనిపిస్తున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.