ఒక సినిమా మీద బాక్స్ ఆఫీస్ దగ్గర బజ్ అనేది లేక పొతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఇప్పుడు దారుణంగా మారిపోతుంది. ఇది వరకు ఆడియన్స్ టాక్ మరీ నెగటివ్ గా వచ్చినా కానీ ఒకసారి అయినా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్స్, ఇంటర్వెల్ లో స్నాక్స్ కి పెడుతున్న రేట్స్ చూసి జనాలు థియేటర్స్ వైపు అస్సలు వెళ్ళడం లేదు…
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కొంచం టాక్ నెగటివ్ గా వచ్చినా అన్ని సినిమాల పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. రీసెంట్ గా నాలుగు బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ హిట్స్ కొట్టిన హీరో నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా పై…
క్లియర్ గా కనిపించగా 4 వరుస హిట్స్ తర్వాత వచ్చిన ఈ సినిమా పై మినిమమ్ బజ్ కూడా ఏర్పడలేదు, ఇక టాక్ కూడా కంప్లీట్ గా నెగటివ్ గా ఉండటంతో మొదటి రోజే ఔట్ రైట్ రిజెక్ట్ అయిపోయిన ఈ సినిమా రెండో రోజు నుండే తెలుగు రాష్ట్రాలలో…
చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు మరియు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంది. ఫ్లాఫ్ స్ట్రీక్ లో ఉన్న గోపీచంద్ కి కూడా పక్కా కమర్షియల్ మూవీ ఎంతో కొంత బెటర్ కలెక్షన్స్ ని ఇచ్చింది, కానీ వరుస హిట్స్ తో ఉన్న నాగ చైతన్య సినిమాకి రెండో రోజే ఇలాంటి పరిస్థితి ఉండటం తీవ్రంగా నిరాశ పరిచే అంశం అనే చెప్పాలి.
రీసెంట్ టైం లో మీడియం రేంజ్ మూవీస్ లో రెండో రోజే ఇలా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని, లోవేస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచినా థాంక్ యు మూవీ ఇప్పుడు ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ మూవీగా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది.