బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన రామ్ ది వారియర్ సినిమా కానీ ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన నాగ చైతన్య థాంక్ యు మూవీ కానీ తొలి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. కానీ వారియర్ మూవీ కమర్షియల్ మూవీ అవ్వడం థాంక్ యు కంప్లీట్ క్లాస్ మూవీ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా మాస్ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా కలిసి వచ్చింది.
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రెండో వీకెండ్ లో క్లియర్ గా కనిపించింది, 4 హిట్స్ కొట్టిన నాగ చైతన్య నుండి వచ్చిన థాంక్ యు మూవీ 3 వ రోజు ఆదివారం కేవలం 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 50 లక్షల షేర్ ని అందుకుంది.
ఇక 11వ రోజులో ఉన్న వారియర్ తెలుగు రాష్ట్రాలలో 44 లక్షల షేర్ ని అందుకుంటే వరల్డ్ వైడ్ గా 57 లక్షల షేర్ తో కొత్త సినిమాను సేం ఫ్లాఫ్ టాక్ తో డామినేట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ మూవీకి ఎంతో కొంత ఉన్న అడ్వాంటేజ్ ఇది అని చెప్పాలి. కానీ 2 సినిమాలు ఓవరాల్ గా తీవ్రంగానే నిరాశ పరిచాయి అని చెప్పాలి.