బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఏ సినిమాలు కూడా అనుకున్న అంచనాలను అస్సలు అందుకోవడం లేదు. ఇలాంటి టైం లో ఎక్కువ రేట్లు పెట్టి సినిమాలను కొనడానికి బయ్యర్లు కూడా సిద్ధంగా లేరు. ఏదైనా సినిమా మీద నిజంగానే బజ్ ఉంటె తప్పితే ఏమాత్రం ఆసక్తిని చూపడం లేదు. ఇలాంటి టైం లో వాళ్ళకి కొంచం ఆశలను నింపుతున్న సినిమా రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ అని చెప్పాలి.
ఈ సినిమా మీద కూడా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పెద్దగా అంచనాలు లేవు, కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు కొద్దిగా పెరిగాయి. ఇక సినిమా ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా బిజినెస్ పరంగా మరీ ఎక్కువ రేట్స్ కి వెళ్ళకుండా రేట్స్ ని తగ్గించి…
తక్కువ బిజినెస్ తోనే ఇప్పుడు సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇప్పుడు సినిమా నైజాం ఏరియా బిజినెస్ కంప్లీట్ అవ్వగా ముందు 6.5 కోట్ల దాకా రేటు అని టాక్ వచ్చినా ఇప్పుడు రేటుని తగ్గించేసి మొత్తం మీద 5 కోట్ల రేంజ్ రేటుకి సినిమాను అమ్మారట…
దాంతో సినిమా కి పాజిటివ్ టాక్ కనుక వస్తే వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తో చాలా వరకు అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన ఏరియాల బిజినెస్ కూడా కొద్ది వరకు తగ్గనుండగా రీజనబుల్ టార్గెట్ తోనే సినిమా బరిలోకి దిగే అవకాశం ఉంది.