బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ స్లో గా స్టార్ట్ అయినా షో షో కి ఇంప్రూవ్ అవుతూ జోరు చూపించిన సినిమా ఈవినింగ్ షోల టైం కి ఓవరాల్ గా డీసెంట్ డే 1 కలెక్షన్స్ ని…
అందుకోవచ్చు అనుకోగా నైట్ షోలలో 3D వర్షన్ ఓ రేంజ్ లో ట్రెండ్ చూపి ఆల్ మోస్ట్ 80% ఆక్యుపెన్సీని చాలా సెంటర్స్ లో రిజిస్టర్ చేసుకుంది. మొత్తం మీద మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయి తెలుగు రాష్ట్రాలలో కోటికి పైగా షేర్ ని అందుకుంది.
ఒకసారి మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ ను గమనిస్తే…
👉Nizam: 41L
👉Ceeded: 12L
👉UA: 13L
👉East: 8L
👉West: 6L
👉Guntur: 10L
👉Krishna: 7L
👉Nellore: 5L
AP-TG Total:- 1.02CR(1.95Cr~ Gross)
మొత్తం మీద సినిమా 1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా…
మొదటి రోజే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టి ఇంకా 48 లక్షల దూరంలో క్లీన్ హిట్ ని అందుకోబోతుంది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 17.85Cr
👉Telugu States – 1.95Cr
👉Tamilnadu – 0.65Cr
👉Kerala – 0.15Cr
👉Hindi+ROI – 2.10Cr
👉Overseas – 2.30Cr(Approx)
Total WW collection – 25.00CR Approx
ఇదీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ డీటైల్స్ ఇంకా రివీల్ అవ్వాల్సి ఉండగా మొత్తం మీద మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా వీకెండ్ లో మరింత దుమ్ము లేపే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో భారీ లాభాల దిశగా సినిమా దూసుకు పోతుంది అని చెప్పాలి.