మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. సుమారు 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఆన్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం కంప్లీట్ గా నిరాశ పరిచాయి అనే చెప్పాలి.
కానీ ఆఫ్ లైన్ లో రవితేజ సినిమాల బుకింగ్స్ బాగుంటాయి కాబట్టి రామారావ్ కూడా అదే రేంజ్ లో ఓపెన్ అవ్వగా మార్నింగ్ షోలలో కొన్ని సెంటర్స్ లో ఫుల్స్ పడ్డాయి కానీ ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఓవరాల్ గా 30% లోపు ఆక్యుపెన్సీ ఉంది.
ఇక సినిమా కి నైజాంలో కొన్ని సెంటర్స్ లో వర్షాల వలన ఇబ్బందులు తలెత్తగా ఓపెనింగ్స్ ఓవరాల్ గా ఇప్పుడు అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి. కానీ మొత్తం మీద బుకింగ్స్ నిరాశ పరిచే విధంగా ఉండటంతో హౌస్ ఫుల్స్ పడతాయో లేదో అనుకుంటే కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం విశేషం అని చెప్పాలి.
ఇక మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఓవరాల్ బుకింగ్స్ రీసెంట్ రిలీజ్ థాంక్ యు కన్నా బెటర్ గా ఉండగా మిగిలిన మీడియం రేంజ్ మూవీస్ కన్నా తక్కువగానే ఉంది. మొత్తం మీద సినిమా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవచ్చు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నైట్ షోల టైం కి సినిమా కొద్ది వరకు గ్రోత్ ని మరింతగా చూపించి హోల్డ్ చేస్తే సినిమా 3 కోట్ల నుండి 3.3 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవచ్చు. కానీ సినిమా ఇంతకిమించి జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.