బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రీజనబుల్ టార్గెట్ తోనే బరిలోకి దిగిన రవితేజ లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా మొదటి రోజే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఎలా గోలా మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్ వసూళ్ళని సాధించిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజే భారీగా డ్రాప్ అయ్యి నిరాశ పరిచింది. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా…
అనుకున్న రేంజ్ లో హోల్డ్ అయితే చేయడం లేదు. మొత్తం మీద మూడో రోజు ఆల్ మోస్ట్ 25-30% వరకు డ్రాప్స్ ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో కనిపించగా మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 30 లక్షల నుండి…
35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 40 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఒకవేళ అన్ని చోట్లా లెక్కలన్నీ మించి పొతే 50 లక్షల దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ చాలా తక్కువగా ఉంది.
కానీ ఈ కలెక్షన్స్ అసలు సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళే అవకాశం లేనే లేదు అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.