బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల రీజనబుల్ టార్గెట్ తోనే బరిలోకి దిగిన రవితేజ లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా మొదటి రోజే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఎలా గోలా మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్ వసూళ్ళని సాధించిన తర్వాత వీకెండ్ లో కంప్లీట్ గా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సాధించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది సినిమా..
మొత్తం మీద నాలుగో రోజు సోమవారం ఆల్ మోస్ట్ 50% వరకు డ్రాప్స్ ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో కనిపించగా మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 15 లక్షల నుండి…
17లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 20 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. కానీ ఈ కలెక్షన్స్ అసలు సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళే అవకాశం లేనే లేదు అని చెప్పాలి. టార్గెట్ చిన్నదే అయినా కూడా భారీ నష్టాలను సినిమా సొంతం చేసుకోవడం ఇక ఖాయమనే చెప్పాలి.