బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేసింది. ఏ దశలో కూడా ఇక టార్గెట్ ను అందుకునే అవకాశం కనిపించని ఈ సినిమా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కన్ఫాం అనుకోగా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి ఇక… సినిమా మొత్తం మీద 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో….
15-18 షేర్ ని అందుకునే చాన్స్ ఉందని భావించగా మొత్తం మీద 16 లక్షల షేర్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 20 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ 5 రోజుల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది ఇప్పుడు.
👉Nizam: 1.30Cr
👉Ceeded: 69L
👉UA: 60L
👉East: 41L
👉West: 21L
👉Guntur: 35L
👉Krishna: 31L
👉Nellore: 16L
AP-TG Total:- 4.03CR(6.85Cr~ Gross)
👉KA+ ROI: 0.33Cr
👉OS: 47L
Total World Wide: 4.83CR(8.50CR~ Gross)
మొత్తం మీద 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 13.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి… భారీ నష్టాలు ఇక సొంతం అవ్వడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.