బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా బింబిసార సినిమా ఫుల్ డామినేట్ చేసింది సీతా రామం సినిమా ను, క్లాస్ మూవీ అవ్వడం, ఏ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా బింబిసార బి సి సెంటర్స్ లో యమ జోరు చూపించడంతో సీతా రామం హోల్డ్ చేయలేక పోయింది. దాంతో తొలిరోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయింది. ఇక రెండో రోజుకి వచ్చే సరికి కూడా సీతా రామం మూవీ…
తెలుగు రాష్ట్రాల్లో ఏ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే హోల్డ్ ని చూపించింది కానీ బి సి సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో బింబిసార జోరు కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు సీతా రామం మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో…
అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు జోరు అందుకుంటే ఈ లెక్క ముందుకు వెళ్ళొచ్చు. ఇక బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వర్త్ షేర్ 5.84 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 40%-45% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తున్నాయి ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ లో. ఇదే విధంగా అన్ని సెంటర్స్ లో ఉంటె సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా…
రోజు ముగిసే సరికి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని చూపించి హోల్డ్ చేస్తే ఈ లెక్క 3 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద బింబిసార మంచి హోల్డ్ నే చూపించగా సీతా రామం టాక్ ఎక్స్ లెంట్ గా ఉన్నా ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.