మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న కార్తికేయ2 సినిమా అనుకున్నట్లు సరైన థియేటర్స్ దొరికి ఉంటె ఇప్పుడు సాధించిన కలెక్షన్స్ లో మరో 50% వరకు అవలీలగా సొంతం చేసుకుని ఉండేది, కానీ థియేటర్స్ ని హోల్డ్ చేయడంతో ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై పడినా కానీ రెండో రోజు ఆడియన్స్ డిమాండ్ దృశ్యా మరికొన్ని థియేటర్స్ ని, స్క్రీన్స్ ని ఈ సినిమా కోసం…
యాడ్ చేశారు, అక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ అనిపించే విధంగా కొనసాగుతూ దూసుకు పోతుంది, దాంతో ఇప్పుడు సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపుతుంది, మార్నింగ్ షోలలో కొన్ని సెంటర్స్ లో…
వర్షాల వలన ఇబ్బందులు ఎదురు అయినా కానీ మిగిలిన చోట్ల మాత్రం హౌస్ ఫుల్ బోర్డులు చాలా సెంటర్స్ లో పడ్డాయి. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు మొత్తం మీద 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా ఇదే రేంజ్ జోరు ని డే ఎండ్ అయ్యే వరకు కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డే 1 రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఎక్స్ ట్రా షోలు సొంతం అయితే ఈ కలెక్షన్స్ మరికొంత ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు కి మించినా లేక మొదటి రోజు లెవల్ లో…
కలెక్షన్స్ సొంతం అయినా కానీ సినిమా సెన్సేషనల్ హోల్డ్ నే రెండో రోజు సొంతం చేసుకోబోతుంది అని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ తో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని ఎంతవరకు పెంచుకుంటుందో చూసి మరో ఆర్టికల్ లో కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.