బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఇప్పుడు సెకెండ్ వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఇప్పటికీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మల్టిప్లెక్సులలో సీతా రామం సినిమా మంచి హోల్డ్ ని మరోసారి చూపించగా మరో పక్క…
బింబిసార మల్టిప్లెక్సులలో పర్వాలేదు అనిపిస్తూనే బి సి సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. దాంతో ఇప్పుడు 2 సినిమాలు 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపబోతున్నాయి… సీతా రామం సినిమా ఆల్ మోస్ట్ 9వ రోజు తో పోల్చితే…
10వ రోజు చాలా సెంటర్స్ లో ఈక్వల్ గా కొన్ని సెంటర్స్ లో కొంచం డ్రాప్ అయినా ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 10వ రోజున 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించ వచ్చు. ఇక బింబిసార సినిమా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో….
1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సెంటర్స్ లో కార్తికేయ2 వలన డ్రాప్స్ కనిపించినా ఓవరాల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగానే ఉండటంతో 1 కోటి ఆ పైన కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సీతా రామం 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉండగా…
బింబిసార 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు. 10 వ రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి. ఇక 11వ రోజు కూడా హాలిడే నే అవ్వడంతో మరోసారి ఈ సినిమాలు దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ 10 డేస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో ఉండవో చూడాలి.