బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో భారీ లెవల్ లో రిలీజ్ కానుంది. ఒక్క అమెరికాలో సినిమా ఏకంగా 600 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ప్రీమియర్స్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఎక్స్ లెంట్ అనిపించే విధంగా జరుగుతూ ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల డాలర్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు ప్రీమియర్స్ తోనే అవలీలగా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని…
అటూ ఇటూగా అందుకోవడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి. ఈ మాస్ కంటెంట్ కి అక్కడ ఈ రేంజ్ లో రెస్పాన్స్ అది కూడా స్టార్స్ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉందని చెప్పాలి ఇప్పుడు….
ఈ మాస్ మూవీ అక్కడ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోబోతుండగా టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కానీ ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సొంతం చేసుకుంటుందో చూడాలి.