బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కట్ పుట్లీ సినిమా తమిళ్ అండ్ తెలుగు లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన రాక్షసుడు సినిమా రీమేక్ గా రూపొందింది. అక్షయ్ కుమార్ డిస్నీ ప్లస్ వాళ్ళతో ఆల్ రెడీ జరిగిన ఒప్పందం మేరకు ఈ సినిమా చేసినట్లు టాక్ ఉండగా అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమాను మొత్తం మీద 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే కంప్లీట్ చేసినట్లు టాక్ ఉండగా…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఈ సినిమా కి గాను ఏకంగా 135 కోట్ల రేటు చెల్లించి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారట. కానీ సినిమా రీమేక్ అయినా ఒరిజినల్ ని మరిపించడంలో ఏమాత్రం సఫలం అవ్వక పోవడంతో…
డిజిటల్ లో సినిమా ఏమాత్రం అనుకున్న రేంజ్ లో వ్యూవర్ షిప్ సొంతం కాలేదని అంటున్నారు. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని వ్యూస్ కలుపుకుని 18 మిలియన్స్ రేంజ్ లో వ్యూస్ వచ్చినట్లు సమాచారం. యూనిక్ వ్యూస్ చాలా తక్కువగా సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా…
వచ్చిన వ్యూస్ కి అటూ ఇటూగా 48 కోట్ల వర్త్ రికవరీ సొంతం చేసుకుందని ఎస్టిమేట్ వేస్తూ ఉండగా పెట్టిన రేటు కి సగం కూడా న్యాయం చేయలేక పోయిందని అంటున్నారు. నామ మాత్రపు రీమేక్ కి ఇన్ని కోట్లు పెట్టి కొనడం తప్పేనని చెప్పాలి. దాంతో డిజిటల్ లో ఈ సినిమా భారీ ఫ్లాఫ్ అని బాలీవుడ్ వాళ్ళు తేల్చేస్తున్నారు.