బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క ఫ్లాఫ్ మూవీ భారీ ఇంపాక్ట్ నే క్రియేట్ చేస్తుంది… ఆచార్య ఎపిక్ డిసాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై మెల్లి మెల్లి గా బజ్ ఏర్పడుతుంది కానీ మరీ అనుకున్న రేంజ్ లో అయితే కాదనే చెప్పాలి. ఆ ఇంపాక్ట్ సినిమా ఓవరాల్…
బిజినెస్ పైనే కూడా క్లియర్ గా పడుతూ అనుకున్న రేంజ్ లో ఆఫర్స్ అయితే రావడం లేదు. దాంతో సినిమాను మరీ డిమాండ్ చేయకుండా రీజనబుల్ రేట్స్ కే అమ్ముతున్నారు ఇప్పుడు. నైజాం ఏరియా బిజినెస్ వాల్యూ 22 కోట్లకు డీల్ జరగగా ఇప్పుడు సినిమా…
పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. సినిమాను కన్నడ లో ఆల్ మోస్ట్ 6.40 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఆచార్య సినిమా ఇక్కడ 9 కోట్ల బిజినెస్ ను అందుకోగా టోటల్ రన్ లో 2.8 కోట్ల షేర్ తో..
ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది… దాంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ ను రీజనబుల్ రేటుకే అమ్మారు, కానీ రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాల్లో లోవేస్ట్ బిజినెస్ ను గాడ్ ఫాదర్ సొంతం చేసుకోబోతుంది, కానీ అదే టైం లో సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే లాభాలు కూడా అదే రేంజ్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది.