రీసెంట్ టైం లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ నేనే వస్తున్నా సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఒకేసారి రిలీజ్ అవ్వగా తెలుగు లో అసలు ఎలాంటి ప్రమోషన్స్ ని కూడా జరుపుకోకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయినప్పటికీ కూడా థియేటర్స్ పరంగా మాత్రం సాలిడ్ రిలీజ్ నే దక్కించుకుంది. ఇక సినిమా ఎలా ఉందో ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ విషయానికి వస్తే ట్విన్స్ అయిన హీరోలలో ఒకరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వలన విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. పెద్దయ్యాక అనుకోకుండా ఒక హీరో కూతురు… తర్వాత ఏం జరిగింది… ఫైనల్ గా ఏం జరిగింది అన్నది సినిమా మిగిలిన కథ….
మొత్తం మీద పెర్ఫార్మెన్స్ పరంగా ధనుష్ మరోసారి ఆదరగోట్టగా చిన్న రోల్ లో సెల్వరాఘవన్ కూడా మెప్పించాడు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించగా ఎడిటింగ్ ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పింది. మొత్తం మీద సినిమా కథ చాలా డిఫికల్ట్ పాయింట్ తోనే తెరకేక్కినా ఫస్టాఫ్ వరకు కథ పడుతూ…
లేస్తూ సాగినా కానీ ఓవరాల్ గా ఇంటర్వెల్ వరకు సినిమా ఆసక్తిగానే ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ మాత్రం కంప్లీట్ ట్రాక్ తప్పిన సినిమా ఏ దశలో కూడా మళ్ళీ ట్రాక్ ఎక్కలేదు. మొత్తం మీద సెకెండ్ ఆఫ్ పై సినిమా డైరెక్టర్ సెల్వరాఘవన్ మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా చాలా బాగా ఆకట్టుకుని ఉండేది…. మొత్తం మీద ధనుష్ పెర్ఫార్మెన్స్ కోసం…
అక్కడక్కడా వచ్చే కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ కోసం ఓపిక పట్టి చూస్తే మొత్తం మీద సినిమా పర్వాలేదు అనిపించవచ్చు కానీ చాలా ఓపిక పట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది. ధనుష్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే ఇది కొంచం వీకేస్ట్ మూవీ అనే చెప్పాలి. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్…