మణి రత్నం డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా అన్ని చోట్లా తొలిరోజు టాక్ కి అతీతంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. కాగా సినిమా ఇప్పుడు కోలివుడ్ సినిమాల పరంగా ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను అమెరికాలో సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది…
అమెరికాలో తమిళ్ సినిమాల ఓపెనింగ్స్ తెలుగు సినిమాల రేంజ్ లో ఉండవు కానీ రజినీ సినిమాలు మాత్రం అక్కడ కుమ్మేస్తూ ఉంటాయి. కబాలి అక్కడ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవగా ఆ రేంజ్ లో ఇతర కోలివుడ్ మూవీస్ ఎప్పుడూ కూడా తర్వాత రెచ్చిపోలేదు అనే చెప్పాలి.
ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 సినిమా కబాలి రేంజ్ లో కాకున్నా ప్రీమియర్స్ లో కబాలి తర్వాత 1 మిలియన్ కి పైగా ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలవగా ఇప్పుడు డే 1 కలెక్షన్స్ లో కూడా సినిమా 1 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది అని చెప్పాలి ఇప్పుడు…
దాంతో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్స్ తో అక్కడ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క కోలివుడ్ మూవీ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా… దాంతో వీకెండ్ లో అక్కడ అద్బుతమైన కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు…
కానీ అదే టైం లో తమిళ్ వర్షన్ కాకుండా మిగిలిన చోట్ల సినిమాకి ఆడియన్స్ నుండి టాక్ చాలా మిక్సుడ్ గానే ఉందని చెప్పాలి. తెలుగు లో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి సినిమాలు ఈ దసరాకి రిలీజ్ కానున్న నేపధ్యంలో పొన్నియన్ సెల్వన్ 1 సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…