బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్1 పై మిగిలిన ఇండస్ట్రీలలో టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా తమిళ్ లో మాత్రం సినిమా పై అంచనాలు కానీ టాక్ కానీ నెక్స్ట్ లెవల్ లో ఉందనే చెప్పాలి. దానికి తోడూ సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు మాత్రం సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తమిళనాడులో ఏకంగా 24.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రెండో రోజు తమిళనాడులో ఇవి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్.
ఇది వరకు రెండో రోజు దళపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా 23.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ ఆల్ మోస్ట్ 4 ఏళ్ళుగా అలాగే కొనసాగుతూ వస్తూ ఉంది, మధ్య కొన్ని సినిమాలు సర్కార్ దగ్గరగా వచ్చినా కానీ ఏ సినిమా కూడా…
రికార్డ్ కలెక్షన్స్ ని మాత్రం అందుకోలేదు, కానీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా ఊపు చూస్తుంటే మూడో రోజు కూడా ఇప్పుడు బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.