టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది, పండగ టైం లో సినిమా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాలలో. కానీ ఓపెనింగ్స్ పరంగా సినిమా ఓవరాల్ గా అంచనాలను అందుకోలేక పోయింది. తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ షోలకు వర్షాల ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఎదురుదెబ్బ తీయగా…
సినిమాకి మెగాస్టార్ ఇతర సినిమాల మాదిరిగా టికెట్ హైక్స్ కూడా లేక పోవడం, ఇతర సినిమాల మాదిరిగా హైర్స్ కూడా లేక పోవడం అన్నీ కలిపి సినిమా ఓపెనింగ్స్ పై గట్టి ఇంపాక్ట్ ని చూపించింది. దాంతో సినిమా 16-18 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకుంటే…
మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల లోపే ఓపెనింగ్స్ ని అందుకుని నిరాశ పరిచింది, కానీ ఉన్న ప్రతికూలతల నడుమ ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి కానీ పండగ టైం లో ఇంకా బెటర్ గా సినిమా హోల్డ్ చేసి ఉండాల్సింది…. ఇక మొత్తం మీద సినిమా…
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 3.29Cr
👉Ceeded: 3.18Cr
👉UA: 1.26Cr
👉East: 1.60Cr(51L hires)
👉West: 59L
👉Guntur: 1.75Cr(70L Hires)
👉Krishna: 73L
👉Nellore: 57L(7L Hires)
AP-TG Total:- 12.97CR(21.40CR~ Gross)(1.28Cr Hires)
👉KA – 1.56Cr
👉Hindi+ROI – 1.05Cr
👉OS – 2.10Cr
Total World Wide – 17.68CR(32.70CR~ Gross)
ఇదీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్. ఆల్ మోస్ట్ 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 74.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ అయితే ఉంది కాబట్టి లాంగ్ రన్ లో సినిమా జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు.