బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు ఓవరాల్ గా లిమిటెడ్ రిలీజ్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకుంది కానీ ఓవరాల్ గా మాత్రం పండగ టైం లో ఓ బిగ్ మూవీ కి ఉండాల్సిన రేంజ్ కలెక్షన్స్ ని మాత్రం అందుకోలేదు. దానికి తోడూ వర్షాలు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ పై…
ఇంపాక్ట్ చూపగా ఇప్పుడు రెండో రోజులో అడుగు పెట్టిన సినిమాకి కొన్ని చోట్లా వర్షాలు ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా మొదటి రోజు వర్త్ షేర్ 11.69 కోట్లతో పోల్చితే ఆల్ మోస్ట్ 30 టు 35% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా కి…
మ్యాట్నీ ల నుండి జోరు పెంచుతూ, ఈవినింగ్ షోల బుకింగ్స్ బాగుండటంతో రెండో రోజు సినిమా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 6 కోట్ల నుండి 6.50 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి సినిమా కి వర్షాల నుండి నైట్ షోలకు ఇబ్బంది లేకుండా ఉంటే 7 కోట్లు ఆ పైన వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది, కానీ దానికి కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగా హోల్డ్ చేసి కౌంటర్ టికెట్ సేల్స్ జోరు అందుకోవాల్సి ఉంటుంది.
ఇక ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా అక్కడ కూడా ఇంకా జోరు చూపించాల్సి ఉండగా కర్ణాటకలో సినిమా మొదటి రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా రెండో రోజు కూడా మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపిస్తుంది. ఇక డే 2 ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.