మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర గాడ్ ఫాదర్ సినిమాతో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఓపెనింగ్స్ పరంగా పలు కారణాల వలన అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా మంచి ట్రెండ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా సినిమా ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 35% రేంజ్ లో…
డ్రాప్ అయినా కానీ ఈవినింగ్ షోల నుండి మంచి జోరు చూపిస్తున్న సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు అటూ ఇటూగా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ కలెక్షన్స్…
ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఫైనల్ లెక్కలు అన్ని చోట్లా ఇదే రేంజ్ లో రాంపేజ్ తో వర్షాల వలన ఇబ్బందులు లేకుండా ఉంటె 7.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన వసూళ్ళని సినిమా ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఈ రోజు కూడా పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో మాత్రం కొంచం డ్రాప్ అయింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ డే 2 కలెక్షన్స్ ఇదే ఫ్లో కంటిన్యూ అయితే 9 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం…
ఫైనల్ లెక్కలు ఇంకా అంచనాలను మించి సినిమా 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రెండో రోజు సొంతం చేసుకుంటే ఎక్స్ లెంట్ హోల్డ్ ని దక్కించుకుంది అని చెప్పొచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.