టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకోగా తొలిరోజు సినిమాకి వర్షాల ఎఫెక్ట్ రావడం పోటిలో ఉన్న వేరే సినిమాల వలన వైడ్ రేంజ్ ఆఫ్ రిలీజ్ ను సినిమా సొంతం చేసుకోలేదు తెలుగు రాష్ట్రాల్లో. అయినా కానీ ఉన్న థియేటర్స్ లోనే సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే…
సొంతం చేసుకుంది….. సినిమా కి టికెట్ హైక్స్ కనుక ఉండి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బెటర్ కలెక్షన్స్ ని సాధించి ఉండేది. మొత్తం మీద సినిమాకి మొదటి రోజు ఆల్ మోస్ట్ 12 లక్షల రేంజ్ లో టికెట్స్ సేల్స్ అయినట్లు అంచనా…
ఇక రెండో రోజుకి వచ్చే సరికి అందులో నుండి 3 లక్షలు డ్రాప్ అయ్యి ఆల్ మోస్ట్ 9 లక్షల రేంజ్ లో టికెట్ సేల్స్ జరగా రెండు రోజుల్లో టోటల్ గా 21 లక్షల టికెట్ సేల్స్ జరిగాయి. ఇవి ఆల్ మోస్ట్ తక్కువ థియేటర్స్ సమ్మర్ బిగ్ రిలీజ్ లకు ఈక్వల్ అని అని చెప్పొచ్చు.
అదే టైం లో ఆచార్య కన్నా బెటర్ టికెట్ సేల్స్ ఈ సినిమాకి జరిగాయి కానీ టికెట్ హైక్స్ లేక పోవడంతో కలెక్షన్స్ మరీ ఎక్కువగా కనిపించలేదు. ఇక మూడో రోజు కూడా ఆల్ మోస్ట్ 7 లక్షలకు దగ్గర అయ్యే టికెట్ సేల్స్ సినిమాకి జరిగాయి అని అంటున్నారు. దాంతో మూడు రోజుల్లో సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 28 లక్షల రేంజ్ లో టికెట్ సేల్స్…
జరిగినట్లు అంచనా వేస్తున్నారు… ఈ టికెట్ సేల్స్ కి టికెట్ హైక్స్ ఉండి ఉంటే కలెక్షన్స్ మరో లెవల్ లో ఉండేవి, అదే టైం లో టికెట్ రేట్స్ నార్మల్ గా పెట్టడం వలన బెటర్ టికెట్ సేల్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ లాంగ్ రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ వీకెండ్ లో ఓవరాల్ గా ఎంత వరకు ఫుట్ ఫాల్స్ ఈ సినిమాకి సొంతం అవుతాయో చూడాలి.