బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మెగాస్టార్ ఇతర సినిమాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాలలో చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో 400 లోకేషన్స్ అనుకుంటే అక్కడ అనుకున్న టైం కి చాలా తక్కువ లోకేషన్స్ లోనే సినిమా రిలీజ్ అవ్వగా ఆస్ట్రేలియా, UK, న్యూజిలాండ్ ఇలా తెలుగు సినిమాలకు కొంచం మార్కెట్ ఉన్న ఏరియాల్లో రిలీజ్ ను కూడా సొంతం చేసుకోలేదు…
ఇక ఇండియాలో కూడా చెన్నై మరియు మరికొన్ని కీలక ఏరియాల్లో కూడా రిలీజ్ అవ్వలేదు… ఇలా సినిమా మేకర్స్ రిలీజ్ విషయంలో పూర్ ప్లానింగ్ చేయగా పోటిలో టికెట్ హైక్స్ లేకుండా, హైర్స్ కూడా లేకుండా రిలీజ్ అయిన సినిమా మొత్తం మీద…
మెగాస్టార్ ఇతర సినిమాలతో పోల్చితే చాలా తక్కువ ఓపెనింగ్స్ ని అందుకుంది, టికెట్ హైక్స్ అండ్ భారీ రిలీజ్ కనుక ఉండి ఉంటే తొలిరోజు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవి, అలాగే ఓవర్సీస్ లో సజావుగా రిలీజ్ అయ్యి ఉంటే అక్కడ కూడా బెటర్ వసూళ్ళని అందుకుని ఉండేది… ఇదంతా కూడా…
మేకర్స్ పూర్ ప్లానింగ్ అనే చెప్పాలి, రిలీజ్ కి వారం ముందు దాకా పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ రోజు కాంపిటీషన్ ఉండటంతో సరిగ్గా థియేటర్స్ అగ్రిమెంట్స్ చేయలేక పోయారు… తద్వారా తక్కువలో తక్కువ 10 కోట్లకు పైగానే సినిమాకి ఓపెనింగ్స్ లో దెబ్బ పడి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా… ఇప్పుడు అవే కలెక్షన్స్ లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని…
మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఆ కలెక్షన్స్ యాడ్ అయ్యి ఉంటె వీకెండ్ లోనే సినిమా సగానికి పైగా మొత్తాన్ని రికవరీ చేసి ఉండేది, కానీ ఇప్పుడు ఆ మొత్తం లాంగ్ రన్ ని సొంతం చేసుకుని స్టడీగా జోరు చూపిస్తేనే బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది. మరి గాడ్ ఫాదర్ లాంగ్ రన్ ని సక్సెస్ ఫుల్ గా దక్కించుకుంటుందో లేదో చూడాలి.