మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ 5 డేస్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకోబోతుండగా ఉన్నంతలో సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా 5వ రోజు రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఉండగా సినిమా ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ తో.. రాంపేజ్ ని చూపించినా కానీ అది మరీ సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సినిమా అటూ ఇటూగా ఇప్పుడు 4వ రోజు లెవల్ లోనే ట్రెండ్ అవుతూ ఉండగా ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో వర్షాల వలన ఇబ్బందులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పై పడే అవకాశం ఉండగా….
మొత్తం మీద ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 5.5 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని అందుకోనుంది. సినిమా ఈ రోజు 8.5-9 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ అందుకుని ఉంటె…
తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ అయినా పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు, కానీ సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తున్నా గ్రోత్ పరంగా భారీ లీడ్ ని అయితే అందుకోవడం లేదు, ఇక వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.