టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మెగాస్టార్ ప్రీవియస్ రేంజ్ తో పోల్చితే ఇతర స్టార్ మూవీస్ తో పోల్చితే యావరేజ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ కి ముందు సినిమా కి కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేయగా మిగిలిన ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసినా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 91 కోట్ల రేంజ్ లో ఉందని…
టాలీవుడ్ ట్రేడ్ అంచనా వేసి చెప్పగా టీం నుండి ఎలాంటి విముఖత అయితే వ్యక్తం కాలేదు, కానీ సినిమా వర్కింగ్ డేస్ లో పూర్తిగా స్లో అయ్యి టార్గెట్ కి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉన్న టైం లో ప్రొడ్యూసర్ తో సినిమాని ఏ ఏరియాలో కూడా అమ్మలేదని…
అన్ని ఏరియాల్లో మేమే ఓన్ గా రిలీజ్ చేశామని, కలెక్షన్స్ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వచ్చాయి అంటూ నిర్మాత చెప్పడం జరిగింది. మెగాస్టార్ మూవీస్ లో కంబ్యాక్ తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఫస్ట్ వీక్ లో 53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం, నిర్మాత వాటిని కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయి అనడం విశేషం.
టాలీవుడ్ లో చాలా మంది టాప్ నిర్మాతల సినిమాలు అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బేస్ మీద ఓన్ గానే రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ ఆ హీరోల ప్రీవియస్ మూవీస్ రేంజ్ ని బట్టి ప్రజెంట్ రిలీజ్ రేంజ్ ని బట్టి ఓవరాల్ బిజినెస్ వాల్యూ ఇంత ఉంటుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత మొత్తంలో వసూళ్లు సాధిస్తే హిట్ అవుతుందని చెప్పడం ఈజీ…
కానీ ఇప్పుడు కొత్తగా సినిమా మొత్తం ఓన్ రిలీజ్ అంటూ కొత్త స్టేట్ మెంట్ తో గాడ్ ఫాదర్ టీం చేసిన కామెంట్స్ ని ఫాలో అయితే దసరాకి వచ్చిన ది ఘోస్ట్, స్వాతిముత్యం కూడా హిట్స్ అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఈ మధ్య రిలీజ్ అయిన రాధే శ్యామ్, థాంక్ యు, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని సినిమాలు హిట్ అయినట్లే లెక్క అని చెప్పొచ్చు… ఒక సినిమా నిర్మాతకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పుడు చాలా మొత్తం రికవరీ అవుతూ ఉండటంతో దాదాపు ఏ నిర్మాత కూడా నష్టాలు దాదాపుగా సొంతం చేసుకోవడం లేదు…
కానీ థియేట్రికల్ రిలీజ్ కి వచ్చే సరికి ఒక సినిమా హిట్టా లేక ఫ్లాఫా అన్నది ఆ సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ ను అందుకుందా లేదా అన్న దాని పైనే డిపెండ్ అవుతుంది…. ఇక గాడ్ ఫాదర్ సినిమా నైజాంలో బిజినెస్ జరిగింది, తెలుగు రాష్ట్రాల ఆవల బిజినెస్ జరిగింది, ఆంధ్ర సీడెడ్ లో మాత్రం సినిమాను అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేశారు మారిన కొత్త వాల్యూ బిజినెస్ ప్రకారం…. ఇలా వాల్యూ బిజినెస్ ఉంటుంది అని చెప్పాలి.
👉Nizam – 17.50Cr
👉Ceeded – 11.50Cr(Valued)
👉Andhra – 25Cr(Valued)
Total AP TG:- 54CR
👉KA – 6.00Cr
👉Hindi+ROI – 5.50Cr(Valued)
👉OS – 7.5Cr
Total WW Business – 73CR( Break Even – 74.00CR)
గాడ్ ఫాదర్ థియేట్రికల్ రన్ లో హిట్ అనిపించుకోవాలి అంటే 74 కోట్ల షేర్ ని అందుకుని తీరాల్సిందే…. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.