టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారంలో జస్ట్ ఓకే అనిపించుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి డ్రాప్స్ పర్వాన్ని కొనసాగిస్తూ ఉంది, సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 8వ రోజు తో పోల్చితే ఇప్పుడు 9వ రోజు మరో సారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా….
ఈవినింగ్ షోలు కూడా పెద్దగా గ్రోత్ ఏమి కనిపించలేదు, మొత్తం మీద సినిమా ఇప్పుడు 9వ రోజు తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9వ రోజు 55 లక్షలకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది….
రెండో వారంలో ఉన్నప్పటికీ కూడా సినిమా కి ఇవి వర్కింగ్ డేస్ కాబట్టి ఆ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది, ఇక మొత్తం మీద సినిమా ఇప్పుడు 9 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.