బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పరుగును త్వరగా కంప్లీట్ చేసుకుంది, మొదటి వీకెండ్ పండగ అడ్వాంటేజ్ వలన పర్వాలేదు అనిపించినా కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని ఈ సినిమా చూపించలేక పోయింది. కాంతార సినిమా వలన ఈ సినిమా మరింత స్లో డౌన్ అవ్వాల్సి రాగా రన్ మూడు వారాలకే కంప్లీట్ చేసుకుంది.
కాగా సినిమాను నైజాం ఏరియాలో అడ్వాన్స్ బేస్ మీద 17.50 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారు…. సినిమా ఓపెనింగ్స్ డీసెంట్ గానే ఉన్నా కానీ తర్వాత లాంగ్ రన్ లో మాత్రం ఆనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా…
మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి 12.40 కోట్ల రేంజ్ లో షేర్ ని 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద వాల్యూ బిజినెస్ లో ఆల్ మోస్ట్ 5.10 కోట్ల రేంజ్ లో…
నష్టాన్ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది, పెద్దగా టికెట్ హైక్స్ లేక పోయినా కానీ పండగ వీకెండ్ లో భారీ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగినా కానీ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది గాడ్ ఫాదర్ సినిమా…