నిఖిల్ సిద్దార్థ్ మరియు అనుపమ పరమేశ్వర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ సినిమా మొదటి వీకెండ్ ని ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృశ్యా సినిమా ఇంకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక సినిమా ఇప్పుడు 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పార్షిక హాలిడే…
అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా పోటి లో ఉన్న ఇతర సినిమాలతో పోల్చితే 18 పేజెస్ సినిమా డ్రాప్స్ మాత్రం ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజుతో పోల్చితే 4వ రోజు ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయిన సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా మొత్తం మీద 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 90 లక్షల నుండి 95 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కోటి కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.