కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ కి తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైం లో ఏ కోలివుడ్ హీరోకి కూడా సొంతం కాని రేంజ్ లో రాపిడ్ గ్రోత్ సొంతం అవుతుంది అని చెప్పాలి. విజయ్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తెలుగు లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మధ్యలో బీస్ట్ మూవీ ఒక్కటే కొంచం నిరాశ కలిగించింది. ఇక ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన…
లేటెస్ట్ మూవీ వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ కింద 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇది విజయ్ కి తెలుగు లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి ఇప్పుడు…
ఒకసారి రీసెంట్ టైం లో విజయ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉#Vaarasudu – 16CR***
👉#BEAST – 10Cr
👉#Master – 8Cr
👉#Whistle – 10.25Cr
👉#Sarkar – 7.50Cr
ఇవి విజయ్ నటించిన లాస్ట్ 5 మూవీస్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్కలు….
సినిమా సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా దుమ్ము లేపుతున్న విజయ్ ఇప్పుడు వారసుడు సినిమా తో కనుక టార్గెట్ ను అందుకుంటే విజయ్ అప్ కమింగ్ మూవీస్ కి బిజినెస్ ఇంకా సాలిడ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. మరి వారసుడు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.