బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఊరమాస్ కంటెంట్ తో వచ్చినా కానీ ఓవర్సీస్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారానే హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు ప్రీమియర్ షోల కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా….
సినిమా ప్రీమియర్స్ గ్రాస్ ఇప్పటి వరకు అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 665K మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ని అందుకుని నాన్ వీకెండ్ అండ్ నాన్ ట్యూస్ డే మూవీస్ లో బిగ్ ఓపెనింగ్స్ ని అందుకున్న మూవీస్ లో…
ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సినిమా 5.46 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ప్రీమియర్స్ ఇంకా పూర్తీ అవ్వాల్సి ఉండగా ఫైనల్ లెక్క 7 లక్షల డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అక్కడ సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పాలి. ఇక మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.