బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా ఆల్ మోస్ట్ 6 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ వీర సింహా రెడ్డి రేంజ్ లోనే థియేటర్స్ ను సొంతం చేసుకుంది.
865 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి చాలా సెంటర్స్ లో థియేటర్స్ చివరి నిమిషంలో యాడ్ అవ్వగా అక్కడ ఎక్కువగా కౌంటర్ టికెట్ సేల్స్ పైనే డిపెండ్ అయ్యింది. ఓవరాల్ గా నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా…
సీడెడ్ లో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద మెగాస్టార్ ప్రీవియస్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ కన్నా చాలా బెటర్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి సొంతం అవ్వగా కొన్ని చోట్లా ఆచార్యకి దగ్గర అయ్యే రేంజ్ లో బుకింగ్స్ ఉన్నాయి. దాంతో ఇదే రేంజ్ లో సినిమా డే అంతా జోరు చూపిస్తే…
ముందు అనుకున్నట్లే 17-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు, ఓవరాల్ గా పోటిలో ఇవి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.