బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ రికార్డులను చెల్లాచెదురు చేసిన బాలయ్య లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా రాయలసీమ ఏరియాలో అయితే ఊహకందని ఊచకోత కోసే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇలాంటి ఊరమాస్ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజులో అడుగు పెట్టిన వీర సింహా రెడ్డి…
వాల్తేరు వీరయ్య సినిమా వలన చాలా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది, కొత్త సినిమా రిలీజ్ వలన ఆక్యుపెన్సీ కూడా తగ్గింది, మొత్తం మీద మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు తొలి రెండు షోలకు 70% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు….
కానీ ఈవినింగ్ షోల నుండి పుంజుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే అటూ ఇటూగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి…
సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా 6.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే రెండో రోజు మంచి హోల్డ్ ని సాధించింది అని చెప్పొచ్చు. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.