కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సినిమా ఆడియన్స్ ముందుకు తమిళ్ తెలుగు లో ఒకేసారి రావాల్సింది కానీ తెలుగు లో 3 రోజులు ఆలస్యంగా ఈ రోజు రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా సినిమా కి తెలుగు లో మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్న విజయ్ నటించిన ఈ సినిమా తెలుగు లో ఇప్పుడు భారీ పోటిలో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే…..బిజినెస్ మాన్ అయిన శరత్ కుమార్ కి 3 కొడుకులు, తన కంపెనీని 3 కొడుకుల్లో ఎవరు ప్రతిభని నిరూపించుకుంటారో వాళ్ళ చేతుల్లో పెట్టాలి అనుకుంటాడు, కానీ ఇది నచ్చని హీరో ఇంటికి దూరంగా 7 ఏళ్ళుగా ఉండగా…. కుటుంబాన్ని ఏకం చేయడానికి తల్లి జయసుధ షష్టిపూర్తికి అందరినీ పిలుస్తుంది. ఆ టైం లో అనుకోకుండా జరిగిన పరిస్థితుల్లో కుటుంబం విడిపోతుంది…. దానికి కారణం ఏంటి. హీరో తర్వాత ఏం చేశాడు, కంపెనీని దక్కించుకోవాలని చూస్తున్న ప్రకాష్ రాజ్ తో హీరో ఎలా పోటి పడ్డాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఇలాంటి స్టొరీ పాయింట్ తో తమిళ్ లో పెద్దగా సినిమాలు ఏమి రాలేదేమో కానీ తెలుగులో మాత్రం ఈ స్టొరీ పాయింట్ వాడి వాడి అరిగిపోయింది…. ప్రతీ సీన్ లో కూడా ఈ పాయింట్ ని ఈ సినిమాలో చూశాం కదా అనుకోవడం ఖాయం, కానీ ఇదంతా పక్కకు పెట్టి రొటీన్ స్టొరీ చూడబోతున్నాం అని థియేటర్స్ కి వెళితే లెంత్ ఒక్కటి బోర్ కొట్టించినా కొంచం ఓపికతో చూస్తె మట్టుకు….
వారసుడు పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండటం, భారీ స్టార్ కాస్ట్, తమన్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ మేజర్ ప్లస్ పాయింట్స్… ఇక దళపతి విజయ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ మరోసారి ఆకట్టుకున్నాయి, తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రష్మిక రోల్ సాంగ్స్ లో కనిపించడం వరకు మాత్రమే పరిమితం…. మిగిలిన యాక్టర్స్ లో జయసుధ రోల్ బాగుంది, ప్రకాష్ రాజ్ రొటీన్ విలనిజం మరోసారి చూపించారు….
మొత్తం మీద తమిళ్ వాళ్ళకి ఇది మంచి కథలా అనిపించవచ్చు కానీ తెలుగు లో ఇలాంటి కథలు అనేకం ఆల్ రెడీ చూసి చూసి ఉన్నాం… అల వైకుంఠ పురంలో హైలెట్ అయిన బోర్డ్ రూమ్ సీన్ ని కూడా ఇందులో వాడేశారు…. ఇలా అనేక సినిమాల మిక్స్ తో వచ్చిన వారసుడు తెలుగులో చూసే ఆడియన్స్ కి ఒక్క టికెట్ పై అనేక సినిమాలను మళ్ళీ గుర్తు చేయిస్తుంది…. కానీ అదే సమయంలో మరీ బోర్ అయితే కొట్టించదు అని చెప్పాలి…
ఓవరాల్ గా విజయ్ ఇతర మూవీస్ తో పోల్చితే చాలా టైం తర్వాత ఫ్యామిలీ మూవీతో కనిపించడం, వంశీ పైడిపల్లి రొటీన్ కథనే చాలా వరకు థియేటర్స్ లో కూర్చోపెట్టేలా చెప్పడంతో రొటీన్ అయినా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది వారసుడు…. ముందే చెప్పినట్లు ఇది రొటీన్ స్టొరీ అని తెలిసి థియేటర్స్ కి వెళ్లి ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపిస్తుంది వారసుడు సినిమా… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….
Worst review. Movie is good . I can rate 3.75