మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని దాటేసిన సినిమా వీకెండ్ లో అక్కడ…
ఊహకందని రేంజ్ లో గ్రోత్ ని చూపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సినిమా ఎర్లీ మార్నింగ్ షోల నుండే రాంపేజ్ ను చూపించడం స్టార్ట్ అవ్వగా డే మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ జోరుని చూపించి దుమ్ము లేపింది.
దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఈ లెక్క ఇంకా మించిపోయే అవకాశం కూడా ఉందని చెప్పాలి.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా రెండో రోజు 12 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. ఓవరాల్ గా రెండో రోజు ఇది నిజంగానే పూనకాలు లోడింగ్ అనిపించే రేంజ్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి…