బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసిన విషయం తెలిసిందే. అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా టాలీవుడ్ చరిత్రలోనే రెండో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ వసూళ్ళని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక మూడో రోజులో అడుగు పెట్టిన సినిమా మిగిలిన సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ సంక్రాంతి హాలిడే…
అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది…మిగిలిన సినిమాలు ఏవి వాల్తేరు వీరయ్య దరిదాపుల్లో కూడా లేవు… సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే ఓపెన్ అవ్వగా కొన్ని చోట్లా సినిమా కి ఆడియన్స్ లో ఉన్న డిమాండ్ దృశ్యా ఎక్స్ ట్రా….
థియేటర్స్ ని కూడా యాడ్ చేయగా అక్కడ కూడా ఆక్యుపెన్సీ అదిరిపోయింది. దాంతో ఇప్పుడు రెండో రోజు లెవల్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా ఇప్పుడు 12 కోట్ల రేంజ్ కి…
వెళ్ళినా ఆశ్యర్య పోనవసరం లేదని చెప్పాలి. టాలీవుడ్ లో 3వ రోజు అతి తక్కువ సినిమాలే 12 కోట్లకు పైగా షేర్ ని అందుకున్నాయి. వాటిలో సీనియర్ హీరోగా ఒకే ఒక్కడిగా మెగాస్టార్ రికార్డ్ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి 13.50 కోట్ల రేంజ్ కి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.