బాక్స్ అఫీస్ దగ్గర సంక్రాంతి బిగ్ మూవీస్ పండగ సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయగా రెండు సినిమాలు ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు వేటి రేంజ్ లో అవి బాగానే హోల్డ్ చేసి మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా 2 సినిమాలు ఆల్ రెడీ 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి.
వీర సింహా రెడ్డి 5 రోజుల్లో టోటల్ గా 100 కోట్ల మార్క్ ని అందుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా 127 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక వీర సింహా రెడ్డి సినిమా 6వ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ తో స్లో అయినా ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా వీర సింహా రెడ్డి సినిమా 6 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా 12.50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
దాంతో మొత్తం మీద ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 106 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా వాల్తేరు వీరయ్య సినిమా 139 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. మరి 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఈ అంచనాలను మించుతాయో చూడాలి.