మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొదటి వారం తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది.
సినిమా బిజినెస్ మీద సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడంతో మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మూడో సారి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది వాల్తేరు వీరయ్య సినిమా…
మొత్తం మీద ఖైదీ నంబర్ 150 తో మొదటి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమాతో కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా తర్వాత వచ్చిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు….
2 కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత వాల్తేరు వీరయ్య పై కొన్ని డౌట్స్ చక్కర్లు కొట్టినా అన్నింటినీ పటాపంచలు చేస్తూ వాల్తేరు వీరయ్య 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ లాంగ్ రన్ లో కలెక్షన్స్ పరంగా ఇంకా జోరు చూపించే అవకాశం ఉంది.