టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నైజాం ఏరియాలో మొదటి సారిగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అవ్వగా వాళ్ళ నిర్మాణంలో వచ్చిన వీర సింహా రెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాలను నైజాంలో ఓన్ గానే రిలీజ్ చేశారు. కానీ ఓవరాల్ గా రెండు సినిమాల వాల్యూ బిజినెస్ రేంజ్ లను గమనిస్తే… వీర సింహా రెడ్డి సినిమా 15 కోట్ల బిజినెస్ ను అందుకోగా వాల్తేరు వీరయ్య సినిమా…
18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే… వీర సింహా రెడ్డి సినిమా ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వాల్తేరు వీరయ్య సినిమా 28.50 కోట్లకు అటూ ఇటూగా…
షేర్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఫైనల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా మొత్తం మీద 2 సినిమాల టోటల్ బిజినెస్ లు 33 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ 44.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి.
మొత్తం మీద 2 సినిమాలు వాల్యూ బిజినెస్ మీద ఇప్పటి వరకు 11.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ మేకర్స్ కి సొంతం అవ్వగా లాంగ్ రన్ లో వాల్తేరు వీరయ్య మేకర్స్ కి ఇంకా ప్రాఫిట్స్ ను పెంచే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద మొదటి సారి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి నైజాంలో ఎంటర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ కి ఈ 2 సినిమాలు సూపర్బ్ ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టాయి అని చెప్పాలి.